తెలంగాణలో కుటుంబ పాలన పోవాలని టీఆర్ఎస్ నాయకులే అంటున్నారు : రాజగోపాల్‌రెడ్డి

-

తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. అయితే.. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పతనం మునుగోడు నుంచే మొదలు కానుందని అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన పోవాలని సొంత టీఆర్ఎస్ నాయకులే చెబుతున్నారంటూ కామెంట్స్ చేశారు రాజగోపాల్‌ రెడ్డి. మునుగోడు ప్రజల చేతిలో నేను ఒక ఆయుధమని, ఈ ఆయుధంతో కేసీఆర్ ని అంతమొందించాల్సిన అవసరం ఉందని, విజయం మనదే. కానీ, మెజార్టీ ఎంతో మీరు చెప్పాలి అంటూ రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ గెలిచేది రాజగోపాల్ రెడ్డి కాదు మునుగోడు ప్రజలు అని రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేయలేకపోయానని, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే తాను పదవికి రాజీనామా చేశానని మరోసారి స్పష్టం చేశారు రాజగోపాల్‌ రెడ్డి.

తన రాజీనామాతోనే మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, లబ్ధిదారులకు పెన్షన్లు అందుతున్నాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను రాజీనామా చేసిన అనంతరం ఫామ్ హౌస్ లో ఉన్న సీఎం కేసీఆర్ మునుగోడు వచ్చారని ఎద్దేవా చేశారు రాజగోపాల్ రెడ్డి. నెల రోజుల నుండి ఏ టీవీ పెట్టినా మునుగోడు అంశాలే ప్రసారం అవుతున్నాయన్నారు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డిలే అవుతారని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. తన ప్రాణం పోయినా మునుగోడు ప్రజలు తల దించుకునే పని చేయనని చెప్పారు. చరిత్రలోనే నిలిచిపోయే తీర్పు మునుగోడు ప్రజలు ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు రాజగోపాల్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version