కేటీఆర్.. రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంగళవారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేటీఆర్ కలిసిన తర్వాత కవిత లిక్కర్ కేసు ఆగిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. ఇన్నాళ్లూ కేటీఆర్‌కు కొంత నాలెడ్జ్ ఉందనుకున్నానని.. కానీ, ఇవాళ్టి మీడియా చిట్ చాట్ తర్వాత కేటీఆర్‌కు ఏం తెలియదని స్పష్టమైందని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఉద్యమ సమయంలో ఆయన్ను బండ బూతులు తిట్టిన దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని నియంతలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర కేవలం 1 శాతం మాత్రమే అని తెలిపారు కోమటిరెడ్డి. ఎన్నికల వేళ 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఒక్కొక్కరికి కేసీఆర్ రూ.10 కోట్లు ఇచ్చి పంపారని అన్నారు.
కేటీఆర్ రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తి విమర్శించారు కోమటిరెడ్డి. తాము స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నాడని గుర్తుచేశారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్ బయటకి వచ్చి పార్టీ పెట్టాడని కోమటిరెడ్డి అన్నారు. రాజశేఖర్ రెడ్డిని ఎదిరించి తాము తెలంగాణ కోసం కొట్లాడామని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో మాట్లాడిన మాటల రికార్డులను కేటీఆర్ వినాలని సూచించారు కోమటిరెడ్డి. పువ్వాడ అజయ్ కి… తెలంగాణ ఉద్యమం కి సంబంధం ఏముంది. సోనియాగాంధీ ని ఇంకో సారి అంటే పాపం తగులుతోంది కేటీఆర్. సోనియా గాంధీ తో గ్రూప్ ఫోటో ఎందుకు దిగావు. పనికి రాని మాటలు మాట్లాడకు. ఇంటర్ పేపర్ దిద్దడం రాదు. టీఎస్పీఎస్సీ పరీక్షలు పెట్టలేవు కానీ.. మాపై మాట్లాడుతున్నాడు’ అంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు.