టాలీవుడ్‌లో మూడో రోజూ కొనసాగుతున్న ఐటీ రైడ్స్..

-

టాలీవుడ్‌లో మూడో రోజూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలు, సహా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, డైరెకర్ల ఇండ్లు, కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న దాడులు నేటికీ కొనసాగుతున్నాయి. దాదాపు 55 కు పైగా బృందాలు దిల్ రాజు, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా, డైరెక్టర్ సుకుమార్, నిర్మాత రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేనీ, చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాలకు పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చాయని ఐటీ శాఖకు ఫిర్యాదులు రావడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బడా నిర్మాత దిల్ రాజుకు ప్రొడక్షన్ బ్యానర్ ఎస్వీసీసీలో మొత్తం రెండు సినిమాలు విడుదలవ్వగా భారీగా కలెక్షన్లను రాబట్టాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.నిర్మాతలకు చెందిన బ్యాలెన్స్ షీట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version