టీచర్లను అవమాన పరిచేలా సెర్క్యులర్ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

-

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల ఆస్తుల ఉత్తర్వులపై టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లకు సంబంధించి సెర్క్యులర్ తీసుకువచ్చారు.

ఎక్కడో ఒక టీచర్ ఆస్తులు కూడబెట్టాడని, అందరు టీచర్లు ఆస్తులు వెల్లడించాలని టీచర్లను అవమాన పరిచేలా సెర్క్యులర్ ప్రభుత్వం జారీ చేయటాన్ని ఖండిస్తున్నాం. వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉద్యోగి తప్పు చేస్తే అతని మీద చర్యలు తీసుకివాలి. ఉపాధ్యాయులు తమ సమస్యల మీద ఎక్కడ ఉద్యమిస్తారో నని వారిని భయబ్రాంతులకు గురి చేయటం నేను ఎక్కడా చూడలేదు. ఉపాధ్యాయులు ఆస్తులు కొనాలన్నా అమ్మలన్నా అనుమతి తీసుకోవాలని చెప్పటాన్ని ఖండిస్తున్నాం. తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలి. మీ ఎమ్మెల్యే లు, మంత్రులు, వారి కుటుంబం ఆస్తులు, బినామీల మీద ఉన్న ఆస్తులు వెల్లడించాలి. మీ పార్టీ కి 800 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయో ప్రకటించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version