కాంగ్రెస్ కు నేను రాజీనామా చేయడం లేదు – కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేయడం లేదంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి రాజీనామా చేస్తూ న్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. దీనిపై స్వయంగా ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి స్పందించారు.

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేయడం లేదంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నేను రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం తప్పు అని తేల్చి చెప్పారు.
నిన్నంతా కూడా సోనియాగాంధీ తోనే ఉన్నానని.. ఎప్పటికీ.. నేను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని ప్రకటించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. నేను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మవద్దు.. మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. నేను అధికారికంగా ప్రకటించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version