తెలంగాణ పీసీసీ పదవి ఎంపి రేవంత్ రెడ్డికి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక అది టీపీసీసీ కాదని.. టీడీపీ పిసిసి గా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టిడిపి నుండి వచ్చిన నాయకులు నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దని పేర్కొన్నారు. ఓటుకు నోటు మాదిరిగానే… నోటుకు పిసిసి పదవి వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ పిసిసి పదవినీ ఇంఛార్జి అమ్ముకున్నారని.. వీటి ఆధారాలు త్వరలోనే బయట పెడతానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నా రాజకీయ భవిష్యత్ కార్యకర్తలు నిర్ణయిస్తారని.. ఇక ముందు.. తన నియోజకవర్గం… జిల్లాకే పరిమితం అవుతానని పేర్కొన్నారు. ఈ విషయంలో సోనియా, రాహుల్ గాంధీల పై విమర్శలు చేయబోనని.. తెలంగాణ ఇచ్చిన వాళ్లపై ఆరోపణ చేయబోనని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాగా నిన్న తెలంగాణ పీసీసీగా ఎంపి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.