హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు బిగ్ షాక్.. వారంతా రాజీనామా..

-

టీఆర్ఎస్ నుంచి మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని ఆనంద పడుతున్న బీజేపీ కి హుజురాబాద్ నియోజకవర్గంలో గట్టి దెబ్బ తగిలింది. ఇల్లందకుంట బీజేపీ పార్టీకి చెందిన మండల ప్రధాన కార్యదర్శి తోడేటి జితేంద్ర గౌడ్, యువ మోర్చా అధ్యక్షుడు గుత్తికొండ పవన్ తో పాటు దాదాపు 200 మంది రాజీనామాలు చేశారు. గత 20 ఏళ్లుగా బీజేపీలో ఉన్నామని ప్రస్తుతం బీజేపీలో నూతనంగా చేరిన ఈటల రాజేందర్ తో పడకనే బీజేపీని వదులుతున్నట్లు స్పష్టం చేశారు.

ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీగా ఉన్న హుజురాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటి నుంచే జోరుగా ప్రచారం చేస్తున్నారు. విజయం పై ఇరు పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో బీజేపీకి చెందిన నేతల రాజీనామాలు ఆ పార్టీకి పార్టీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మైనస్ గా మారనున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

రాజీనామా చేసిన నేతలు మాట్లాడుతూ… ఈటల వద్ద తమకు సరైన ప్రాధాన్యం లభించట్లేదని జిల్లా నాయకత్వానికి కూడా చెప్పామని.. కానీ వారు కూడా పట్టించుకోలేదని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీలో ఏవైనా అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో మండలంలో అగ్రశ్రేణి నాయకులు రాజీనామాలు చేయడం ఏంటని కొందరు బీజేపీ నాయకులు గుసగుసలాడుతున్నారు.

మరో పక్క ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో తనకు ఆత్మగౌరవం కరువైందని చెప్పి.. బీజేపీలో చేరాడు. దీనికి ముందే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version