ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ నెల 20 వ తేదీన తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రతినిధి పట్టాభి రామ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ చేసిన పట్టాభిని.. భద్రత నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు కు పంపారు. ఈ నేపథ్యంలోనే నిన్న పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు.
దీంతో నిన్న రాత్రి పట్టాభిని విడుదల చేశారు పోలీసులు. అయితే… రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదలైనా ఇప్పటికీ పట్టాభి మాత్రం ఇప్పటి వరకు ఇంటికి చేరలేదు. విజయవాడ నగరంలోకి పట్టాభి ఆచూ కీ ఎక్కడా లభించలేదు. దీంతో టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల అదుపులోనే పట్టాభి ఉన్నాడంటూ అటు కార్యకర్తలు ఆరోపణలు చేస్తుండగా…తమ అదుపులో లేడంటున్నారు పోలీసులు. పట్టాభిని వేరే ప్రాంతం లోనే సురక్షితంగానే ఉన్నాడని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు.