కొండా ఫ్యామిలీ వల్ల నా పరిస్థితి ఇది.. ఆర్జీవీ సంచలన ట్వీట్

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటాడు. ఎవరేం అనుకుంటే నాకేమిటనే రకం. తాను చెప్పాలనుకునేది ఏదైనా సూటిగా చెప్పడం ఆర్జీవీ స్టైల్. కాంట్రవర్సీ టాపిక్ లే సినిమా కథలుగా సినిమాలు తీస్తుంటాడు. పరిటాల, సూరి కథాంశంతో రక్త చరిత్ర సినిమా తీసి సంచలన క్రియేట్ చేశాడు. ఆ తరువాత బెజవాడ రౌడీ ఇజం బ్యాక్ డ్రాప్ గా వంగవీటి, బెజవాడ సినిమాలు తీశారు. తాజాగా కొండా మురళీ జీవితం ఆధారంగా ‘కొండా’ సినిమా తీస్తున్నారు. 

ఈ సినిమా త్వరలో రీలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా తెగ కాంట్రవర్సీ అవుతోంది. సినిమాలోని కొన్ని పాత్రలు వరంగల్ రాజకీయ నాయకులను ముఖ్యంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలి ఉన్నాయంటూ ఆయన అనుచరులు ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కొండా సురేఖ, ఇతర చిత్రయూనిట్ తో  కలిసి ఓ ఆలయంలో దర్శనం చేసుకుంటున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘ కొండా ఫ్యామిలీ మూలాన ఇది నా పరిస్థితి ’’ అంటూ కామెంట్ రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version