గోదావరి వరద బాధితులు అధైర్యపడొద్దు : మంత్రి కొప్పుల

-

గత వారం తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈనేపథ్యంలోనే వరద బాధితులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రభుత్వం తరుఫున నష్టపరిహారాన్ని అందిస్తున్నారు. అయితే గోదావరి వరద బాధితులు అధైర్యపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమశాఖ భరోసానిచ్చారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. మంగళవారం ధర్మపురి మండలంలోని ఆరెపెల్లి, దొంతాపూర్‌ గ్రామాల్లో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని తెలుసుకొని, బాధితులను పరామర్శించారు.

రెండు గ్రామాల్లో 28 మంది బాధితులకు తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయంతో పాటు నిత్యావరసర సరుకులను అందజేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. ప్రకృతి విలయం కారణంగా ప్రజలతో పాటు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు సామర్థ్యానికి మించి, ఊహించని వరద రావడంతో లోతట్టు ప్రాంతాలు  జలమయమయ్యాయన్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 3లక్షల క్యూసెక్కులైతే.. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆరు లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version