KPHB : పాదాచారుడిని బలిగొన్న బుల్లెట్ బైక్

-

రోడ్డు దాటుతున్న పాదాచారుడిని బుల్లెట్ బండి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటన నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పాదాచారుడు రోడ్డు మీద అచేతన స్థితిలో పడిపోయాడు. కాలికి బలమైన గాయం కావడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. స్థానికులు అతన్ని చూస్తూ ఉండిపోయారు తప్పా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు, అంబులెన్సుకు కాల్ చేసేందుకు సాహసించలేదు.

దీంతో విలవిలలాడుతూ ఆ పాదచారుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఈ రోడ్డు ప్రమాదంపై ఆరా తీశారు. అనంతరం స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపారు.కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version