తెలుగు ఇండస్ట్రీలో కృతి శెట్టికి తగ్గిన అవకాశాలు కారణం అదేనా!

-

తెలుగు తెరపై తారాజువ్వలా మెరిసిన కృతి శెట్టి మొదటి సినిమాతో పాపులర్ అయిన విషయం తెలిసిందే… తెరపై కృతిని చూడగానే ఈ అందాల చందమామ ఎవరు? అంటూ కుర్రాళ్లంతా కళ్లప్పగించారు. అందం .. అభినయంతో పటు కృతి శెట్టి అదృష్టవంతురాలు అనుకున్నారు. అందుకు కారణం ఫస్టు మూవీ 100 కోట్లు వసూలు చేయడం .. హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో పడటం. అయితే ఆ తరువాత వరుసగా ఆమె మూడు ఫ్లాపులను చూసింది. అయినా కృతి శెట్టి టీనేజ్ లోనే ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ, అందువలన వరుస అవకాశాలు వస్తాయనే అంతా అనుకున్నారు.

కానీ ఆమె చేతిలో ప్రస్తుతం ‘కస్టడీ’ అనే సినిమా మాత్రమే ఉంది. తెలుగుతో పాటు తమిళంలోను మే 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. పనిలో పనిగా బాలీవుడ్ ఛాన్సుల కోసం ముంబై చుట్టూ కూడా తిరుగుతోంది. అక్కడ అవకాశాల సంగతి అలా ఉంచితే, ఈ సుందరికీ ఇక్కడ గ్యాప్ రావడం ఖాయమని అంటున్నారు. కృతి ఇతర భాషలపై ఎక్కువ దృష్టి పెడుతుందా? లేదంటే ఇక్కడ మంచి కథల కోసం వెయిట్ చేస్తుందా? అనేది తెలియడం లేదు. ఇక మలయాళంలో టోవినో థామస్ జోడీగా ఆమె ఒక సినిమా చేస్తోంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version