ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉందని.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంగళగిరిలో దివంగత సీఎం వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు.. మొత్తం పాలక పక్షమే అన్నారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు, జగన్, పవన్ అందరూ బీజేపీ పక్షమే కాబట్టి.. ప్రజల సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్షనేత షర్మిలను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
వైఎస్సార్ స్పూర్తితో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారు. రాహుల్ గాంధీ ఈ సభకు రావాలనుకున్నారు. కానీ మణిపూర్ పర్యటన కారణంగా రాలేకపోయారు. వైఎస్సార్ దూరమై 15 ఏల్లు అయినా ఆయన జ్ఞాపకాలు మన కళ్లముందు ఉన్నాయి. శాసనమండలిలో 2004లో తాను తొలి వచ్చినప్పుడు తాను రాత్రంతా ప్రిపేర్ అయి వచ్చాను. తాను అడిగిన ప్రశ్నలన్నింటికీ వైఎస్సార్ సమాధానం చెప్పారు. కొత్త వారిని ప్రోత్సహిస్తేనే.. మంచి రాజకీయనాయకులు తయారవుతారని ప్రోత్సహించేవారు. ప్రతిపక్షం, అధికార పక్షం అని చూడకుండా సమస్యలను మాత్రమే చూసేవారు వైఎస్సార్. కడపలో ఉప ఎన్నికలు వస్తే.. ప్రతీ గ్రామంలో పర్యటిస్తానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.