తెలంగాణలో ప్రస్తుతం జరగనున్న ఎన్నికలు మామూలువి కాదని …మన తలరాతను మనమే రాసుకునే ఎన్నికలని కేటీఆర్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ…తెరాస అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా… దమ్ముంటే రేవంత్ రెడ్డి నా ఛాలెంజ్ స్వీకరించాలని ఛాలెంజ్ విసిరారు. అధిక సంఖ్యలో తెరాస కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడంతో రోడ్లన్ని జనంతో కిక్కిరిసిపోయాయి. తెరాస అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కొడంగల్‌ను దత్తత తీసుకుంటానని కేటీఆర్ తెలిపారు.
పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే అంతా ఆగమేనన్నారు. తెరాస గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్.. ఈ విషయం చిన్నపిల్లోడికి కూడా తెలుసు. కానీ, కాంగ్రెస్ గెలిస్తే 40 మంది సీఎంలు. పదవుల కోసం కొట్టుకోవడానికే సరిపోతుందని ఆయన విమర్శించారు.