కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: KTR

-

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు. మొత్తం లెక్క పెడితే 420 హామీలు ఇచ్చారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశం లో కేటీఆర్ మాట్లాడారు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉండి అధికారం లోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తానన్నారు. రెండు లక్షల రుణం తెచ్చుకోండి అన్నారని గుర్తు చేశారు. తుమ్మల నాగేశ్వర రావు రుణాలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.

లేక పోతే కేసులు పెట్టండి అని అంటున్నాడని చెప్పారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కి జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అది సాధ్యం కాదని మొన్న స్పష్టమైందని చెప్పారు. నోటి కి ఎంత వస్తే అంత అనుకుంటూ హామీలు ఇచ్చారని ఫైర్ అయ్యారు అందుకనే నాలుగు వందల ఇరవై హామీలని చేసే వరకు విడిచిపెట్టమని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version