పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో తీర్పు స్పష్టంగా ఉంది : KTR

-

పార్టీ మారిన ఎమ్మెల్యే లపై సుప్రీంకోర్టు లో తీర్పు స్పష్టంగా ఉంది. అదే తీర్పు ఇప్పుడు కూడా వస్తుంది అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఈ సంవత్సరంలో బై ఎలక్షన్ లు తప్పకుండా వస్తాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాకు టచ్ లోకి వచ్చినా మీకు చెప్తామా. పార్టీ మారిన ఎమ్మెల్యే ల ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయేమో.. అందుకే అలా మాట్లాడు తున్నారు. అయినా పార్టీ మారిన వాళ్ళను మళ్లీ తీసుకోవాలని అనుకుంటే సుప్రీంకోర్టు ఎందుకు వెళ్తాము. ఎన్నికలు తప్పకుండా వస్తాయి.

తెలంగాణ ఉద్యమం లో జైలు కు పోయి వచ్చాము. ఇప్పుడు జైల్ కు పంపినా బయపడం. బీజేపీ కాంగ్రెస్ కలిసి కేస్ లు పెట్టినా మేము వెనక్కి తగ్గం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు. RSS ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మమ్మల్ని అనడం కాదు. ఈ టైం పాస్ కార్యక్రమాలు కొనసాగుతుంటూనే ఉంటాయి. ఎన్ని సార్లు పిలిచినా వస్తాను.. ఎక్కడికైనా వస్తాను. సీఎం విదేశీ పర్యటన తో కొత్తగా పరిశ్రమలు వచ్చేది లేదు. గతంలో నలభై వేల కోట్ల రూపాయలు తెచ్చాము అన్నారు.. నలభై పైసలు కూడా తేలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version