మైదుకూరు కు సీఎం చంద్రబాబు వరాలజల్లు : పుట్టా సుధాకర్

-

టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం చంద్రబాబు మొట్టమొదటిసారిగా మైదుకూరు నియోజకవర్గానికి రావడం శుభ సూచకం అని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. రేపటి దినం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని మైదుకూరులో నిర్వహించడం జరుగుతుంది. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని మైదుకూరు నుండి ప్రారంభించడం జరుగుతుంది.. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమానికి మైదుకూరు మున్సిపాలిటీలోని ఐదు వార్డుల ప్రజలు పాల్గొనాలి.

కేఎస్సి కళ్యాణమండపంలో జరిగేఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనాలి. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమానికి 1500 మందికి వార్డు మెంబర్లు ఇన్చార్జ్ ద్వారా పాల్గొనే వారికి పాసులు జారీ చేస్తాం. మైదుకూరు కు సీఎం చంద్రబాబు వరాలజల్లు కురిపించనున్నారు. మైదుకూరు పంచాయతీగా ఉండే మున్సిపాలిటీగా అయినందున అభివృద్ధి చేయాలని కోరాను. అదేవిధంగా మైదుకూరు నియోజకవర్గ రైతుల కళ రాజోలు ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి గారికి ప్రజెంటేషన్ వివరిస్తాం. మైదుకూరు లో రోడ్లు డ్రైనేజీ నీరు కళాశాలలకు శాశ్వత భవనాలు ముఖ్యమంత్రి గారు మంజూరు చేయాలని కోరుతాం. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు శాయశక్తుల కృషి చేయాలి అని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ కోరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version