మీడియాకు తెలియకుండా.. సిరిసిల్ల అత్యాచార బాధితురాలిని పరామర్శించిన కేటీఆర్ !

-

మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సొంత ఇలాకా అయిన… రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ చిన్నారిపై.. టిఆర్ఎస్ నాయకుడు లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రైతుబంధు కన్వీనర్, టిఆర్ఎస్ లీడర్ శంకర్… అభం శుభం తెలియని ఓ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ పై విమర్శల వెల్లువ కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్… సిరిసిల్ల కు చెందిన అత్యాచారానికి గురయిన చిన్నారిని, తల్లిదండ్రులను పరామర్శించారు.

ఈ సందర్భంగా 2 నిమిషాల పాటు చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడారు కేటీఆర్. మీడియాకు సమాచారం ఇవ్వకుండా .. సైలెంట్ గా నిలోఫర్ కు వచ్చిన కేటీఆర్.. చిన్నారి తల్లిదండ్రులతో భరోసా కల్పించారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు. కాగా నిన్న బండి సంజయ్, rs ప్రవీణ్ కుమార్ ల పరామర్శ చేయగా… ఈ రోజు కేటీఆర్ రావడం కొత్త చర్చకు దారి తీస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version