Rajamouli : “ఆమె జీతం మీద‌నే బతికాను.. ఆమెనే న‌న్ను పోషించింది” : రాజమౌళి ఎమోష‌నల్

-

Rajamouli : తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తం చేసిన విక్రమార్కుడు. వెండి తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించే ద‌ర్శ‌క‌ధీరుడు. అటు మాస్.. ఇటు క్లాస్ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చేసే.. డైరెక్ట‌ర్. బాహుబలి మూవీ తరువాత ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. తెలుగు చిత్రం కూడా వేల కోట్ల వసూళ్లు చేస్తుంద‌ని నిరూపించారు దర్శకుడు రాజమౌళి. ఆయ‌న సినిమా కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.

త‌న కెరీర్ ప్రారంభంలో ఆయ‌న ప‌డిన క‌ష్టాల‌ను గుర్తు చేసుకున్నారు. తాను తెరకెక్కిస్తున్న త్రిబుల్ ఆర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే తన కెరీర్ మొదట్లో అనేక కష్టాలు ప‌డ్డాన‌ని తెలిపాడు జక్కన్న. కొన్ని సంవత్సరాల పాటు తన భార్య సంపాదనపై బతికాను అంటూ మీడియా ముందు ఓపెన్ అయ్యారు.

తనకు చదువు అంతగా రాలేదని, చిన్నప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. అలాంటి సమయంలో తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ సినీ ఇండస్ట్రీలో ఉండడంతో ఆ పరిచయంతోనే అన్ని క్రాఫ్ట్స్‌లో పని చేశానని చెప్పాడు ఈ దర్శకుడు. ఓ దర్శకుడికి అన్ని క్రాఫ్ట్స్‌పై పట్టుండాలనే కసితోనే అన్నీ నేర్చుకున్నట్లు చెప్పాడు. అయితే మద్యలో డైరెక్టర్ గా ట్రై చేస్తున్న కొన్ని రోజులు తనకు పైసా సంపాదన లేదని, నాన్నని అడిగితే ఇస్తారు కాని అడగలేకపోయానని అన్నారు.

అలాంటి సమయంలో నా భార్య ర‌మా జీతం మీద బతికానని, ఆమెనే త‌న‌ని పోషించిందని తెలిపాడు.
ఇలా చెప్పుకోవ‌డం త‌న‌కు సిగ్గేయడం లేదని చెప్పాడు. తాను దర్శకుడు కాకముందు .. భార్య ర‌మాను ఆఫీస్‌లో డ్రాప్ చేసి ఇంటికొచ్చి కధలు, డైలాగ్స్‌ రాసుకోవడం, మళ్ళీ సాయంత్రం రమాని ఇంటికి తీసుకు రావడం అని అన్నాడు.అలాంటి దుర్బ‌ర‌ పరిస్థితుల ఎదుర్కొన్న ఆయ‌న ఈ రోజు దేశం గర్వించదగ్గ దర్శకుడిగా మారాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version