నెల జీతాన్ని కేరళకు సాయంగా ప్రకటించిన కేటీఆర్

-

సహచర ప్రజాప్రతినిధులు కూడా ముందుకు రావాలని పిలుపు…

వరదలతో విలవిల్లాడుతున్న కేరళని ఆదుకోవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు, స్వచ్ఛంద సంస్థలు, సినీ ప్రముఖులు, విదేశీయులు సైతం తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మానవతాహృద‌యంతో స్పందించిన మంత్రి కేటీఆర్ తనవంతుగా నెల జీతాన్ని కేరళకు ఆర్థిక సాయంగా ప్రకటించారు. సంబంధిత చెక్ ను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపిస్తానని ఆయన తెలిపారు. ఇతర సహచర ప్రజాప్రతినిధులు కూడా సాయం చేయడానికి ముందుకు రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేరళకు అండగా తెలంగాణ నిలబడుతుందని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు.

మంత్రి పిలుపుకు స్పందిచిన హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసిద్దీన్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తో సహా పలువురు ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి తమ నెల జీతాన్ని సాయంగా ప్రకటించారు. మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్ల అభినందనలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version