అర్జున్ రెడ్డి కాంబోలో మరో మూవీ..!

-

హీరోగా కేవలం మూడు సినిమాలే చేసినా టాలీవుడ్ లో యువ హీరోల్లో ఏ హీరోకి లేని క్రేజ్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం 3 సినిమాలు వరుసగా చూసుకుంటే సినిమా సినిమాకు విజయ్ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పొచ్చు. అది ఎంతలా అంటే స్టార్ హీరోకి కావాల్సిన స్టఫ్ అంత. అర్జున్ రెడ్డి సినిమాతో తనలోని నటుడిని పరిచయం చేసిన విజయ్ గీతా గోవిందం లో మరో స్టైల్ తో అలరించాడు.

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ బాలీవుడ్ అర్జున్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడట. ఆ సినిమా తర్వాత మహేష్ తో షుగర్ ఫ్యాక్టరీ కథ సిద్ధం చేశాడట. ఇక దానికి ముందే మరోసారి విజయ్ తో అర్జున్ రెడ్డి సీక్వల్ చేసే ఆలోచనలో ఉన్నాడట సందీప్ వంగ. అంతకుముందు కన్నా ఇప్పుడు విజయ్ స్టామినా డబుల్ అయ్యింది. ఈ లెక్కన అర్జున్ రెడ్డి తరహాలో కథ, కథనాలు ఉంటే అర్జున్ రెడ్డిని మించి కలెక్ట్ చేసేలా ఉంటుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version