స‌త్తుప‌ల్లికి న‌ర్సింగ్, పాలిటెక్నిక్ కాలేజీ : కేటీఆర్‌

-

కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆ ఆరు గ్యారెంటీలు ఆరిపోయే దీపాలు అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. మొండిచేయికి ఓటేస్తే 3 గంట‌క‌ల క‌రెంట్ గ్యారెంటీ, సంవ‌త్స‌రానికి ఒక ముఖ్య‌మంత్రి దిగ‌డం ఖాయం, ఆకాశం నుంచి పాతాళం వ‌ర‌కు అన్ని కుంభ‌కోణాలే. ఆ కుంభ‌కోణాల కాంగ్రెస్‌కు అవ‌కాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకోవ‌డం ఖాయం అని కేటీఆర్ అన్నారు. రూ. 50 కోట్ల‌కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కొన్నాడ‌ని కాంగ్రెస్ నాయ‌కులే అంటున్నారు. కోట్ల రూపాయాల‌కు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. వీళ్ల‌కు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు. ప్ర‌జ‌లు కాంగ్రెస్ గ్యారెంటీల‌ను న‌మ్మ‌రు. ఆగం కావొద్దు.. అభివృద్ధిలో భాగం కావాలి అని ప్ర‌జ‌ల‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు.

ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌కు నిధులు ఇవ్వడానికి బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకి 500 రూపాయల “రాజకీయ ఎన్నికల పన్ను” విధించడం ప్రారంభించింది. పాత అలవాట్లు ఎక్కడికి పోతాయ్? ఘనత వహించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ చేసిన కుంభకోణాలు అన్నీ ఇన్ని కాదు. అందుకే దీనికి “స్కాంగ్రెస్” అని పేరు పెట్టారు. ఎంత డబ్బు ముట్టజెప్పినా తెలంగాణ ప్రజలను స్కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు. తెలంగాణ నుండి స్కాంగ్రెస్‌ తరిమికొడదాం!’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version