ఇద్దరూ కలిసినా మాకేమీ నష్టం లేదు : బొత్స

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై చాలా కేసులున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు స్టేలు తెచ్చుకొని నెట్టుకొచ్చారు.. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తప్పించుకోలేకపోయారు అని ఆయన విమర్శించారు. తప్పు చేసినప్పుడు చట్టాల నుంచి తప్పించుకోలేరు.. ధర్నాలు, ఆందోళనలతో కేసుల నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు.. అసెంబ్లీలో అనవసరంగా అల్లరి చేశారు.. చంద్రబాబు కేసులపై చర్చించేందుకు ఎందుకు వెనుకడుగు వేశారని బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఇక, జనసేన- టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇది వరుకు లేదనా.. ఎప్పుడూ వారిద్దరూ కలిసే ఉన్నారు అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇద్దరూ కలిసినా మాకేమీ నష్టం లేదు.. వారాహిలో ఇప్పుడు ఇద్దరూ కలిసి తిరుగుతారు.. కలిసే మాట్లాడుతారు అని ఆయన తెలిపారు. ఇక, పార్టీనే కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం వైసీపీ కార్యకర్తలపై ఉందని మంత్రి బొత్స అన్నారు. దొంగతనం చేసి, దొరికిపోయి జైల్లో పెడితే.. ప్రజల్లో సానుభూతి వస్తుందా అని అడిగారు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.. అందులో రాజీపడే ప్రసక్తి లేదన్నారు.

ఈ రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ‘మోత మోగిద్దాం’ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్యాలెస్ లో ఉన్న సీఎం జగన్ కు వినిపించేలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా మోత మోగించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్స్ వేదికగా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. బాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నాడు కాపులు కంచాలు మోగిస్తే ఇదే చంద్రబాబు కేసులు పెట్టి వేధించారని, కాపు ఆడపడుచులను సైతం దూషించి అవమానాలకు గురి చేశారని విమర్శించారు. అవినీతికి పాల్పడి ఆధారాలతో సహా దొరికిపోయిన బాబు కోసం ఈరోజు ప్రజలు కంచాలు మోగించాలా? అని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును దోచుకుంది కాక… మళ్లీ ప్రజలనే తన కోసం మోతలు మోగించాలని అడగడానికి నోరెలా వస్తోందని ప్రశ్నించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version