తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్ణయించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అయితే శాసన సభ సమావేశాల్లో ఇవాళ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు సుమారు 10 నిమిషాలు ముచ్చటించుకున్నారు.
ఇక అసెంబ్లీ లాబీలో కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. జగ్గారెడ్డిని చూడగానే కేటీఆర్.. పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లా అని అన్నారు.. దానికి బదులిస్తూ జగ్గారెడ్డి.. టీ షర్ట్ తో వస్తే ….పిల్లలవుతారా అని చమత్కరించారు. ఇక ఆ సమయంలో జగ్గారెడ్డితో ఉన్న టీటీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్‌ను చూసి కేటీఆర్.. మీ ఇద్దరి దొస్తాన్ ఎక్కడ కుదిరిందని వారిని అడిగారు. అప్పుడు మామిల్ల బదులిస్తూ.. మాది ఒకే కంచం, ఒకే మంచం అని చెప్పుకొచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డిని గెలిపిస్తవా అని కేటీఆర్ చమత్కరించగా.. ‘సంగారెడ్డిలో జగ్గారెడ్డి ని గెలిపిస్తా.. మన దగ్గరకు పట్టుకొస్తా’ అని మామిల్ల బదులిచ్చారు.