జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. బీఆర్ఎస్ నేతలు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పరామర్శిస్తున్నారు. కేటీఆర్ త్వరగా కోలుకుని ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే కేంద్రమంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేటీఆర్ త్వరగా మంచి ఆరోగ్యం, బలాన్ని పొందాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని రాసుకొచ్చారు. కేంద్రమంత్రి పోస్టుపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘థాంక్యూ బండి సంజయ్ గారు’ అంటూ రిప్లయ్ ఇచ్చారు. ఇదిలాఉండగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సైతం కేటీఆర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరారు.