జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని పహెల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అందులో ఇద్దరు విదేశీ టూరిస్టులు సైతం ఉన్నారు.దీంతో దేశంలోని పాక్ పౌరులందరూ తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు వెళ్లాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పాకిస్తాన్ పౌరులంతా తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే, విశాఖ జిల్లాలో పాకిస్తానీ కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు. అందులో భర్త, పెద్ద కుమారుడికి పాకిస్తాన్.. భార్య, చిన్న కుమారుడికి భారత పౌరసత్వం ఉన్నట్లు తేలింది. తమ కుమారుడి ఆరోగ్యం సరిగాలేదని, ఇప్పుడు భారత్ విడిచి వెళ్లలేమని కుటుంబం విశాఖ సీపీని కోరింది. పాకిస్తాన్ నుంచి దుబాయ్ మీదుగా విశాఖకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.