హైదరాబాద్‌లో అత్యాధునిక వసతులతో చెరువుల అభివృద్ధి : కేటీఆర్

-

హైదరాబాద్‌ నగరం రోజురోజుకీ విస్తరిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలోని శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని 185 చెరువుల అభివృద్ధిలో క్రెడాయ్‌ను భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. నిర్మాణ రంగంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కేసీఆర్ అధికారంలోకి రాగానే హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ అన్నారు. నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నగరంలోని నీటి అవసరాలు, సుందరీకరణ లక్ష్యంలో భాగంగానే చెరువుల అభివృద్ధి కార్యక్రమం తలపెట్టినట్లు వెల్లడించారు. నిర్మాణ రంగంతోపాటు ఫార్మా, పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌ అంతర్జాతీయ కేంద్రంగా మారుతుందని హర్షం వ్యక్తం చేశారు.

“జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ ప‌రిధిలో 155 చెరువులు ఉన్నాయి. దుర్గం చెరువు అభివృద్ధి చెందిన త‌ర్వాత టూరిస్టులు అధికంగా వ‌స్తున్నారు. సినిమా షూటింగ్‌లు కూడా చాలా అయ్యాయి. ఇటీవ‌ల హైద‌రాబాద్ సంద‌ర్శించిన ప్ర‌ముఖులు విదేశాల్లో ఉన్నామా అని ఆశ్చర్య‌పోతున్నారు. ఇది మ‌న న‌గ‌రం.. ఎంత గొప్ప‌గా అభివృద్ధి చేసుకుంటే అంత బాగుంటుంది. మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం పెట్టుబ‌డిగా భావించాలి.” అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version