తెలంగాణలో వరదల్లో ఉంటే రేవంత్ కు మూసీ సుందరీకరణ, ఒలింపిక్స్ ముఖ్యమా? అని నిలదీశారు KTR. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు సిరిసిల్ల నియోజకవర్గం చేరుకున్నారు కేటీఆర్. గంభీరావుపేట మండలం, మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి అప్పర్ మానేరు వరద ఉధృతిని పరిశీలించారు కేటీఆర్.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఉంది రేవంత్ తీరు అని విమర్శలు చేసారు. తెలంగాణ రాష్ట్రం వరదల్లో ఉంటే ముఖ్యమంత్రికి మూసీ సుందరీకరణ, ఒలింపిక్స్ ముఖ్యమా? అని సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. అటు సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శించిన కేటీఆర్…. బాధితులకు దైర్యంగా ఉండమని చెప్పి, అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఉంది రేవంత్ తీరు.
రాష్ట్రం వరదల్లో ఉంటే ముఖ్యమంత్రికి మూసీ సుందరీకరణ, ఒలింపిక్స్ ముఖ్యమా?
– సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. pic.twitter.com/HxBYR6kXHf
— Mission Telangana (@MissionTG) August 28, 2025