రేవంత్ విషయంలో అనవసరంగా రియాక్టు అవుతున్న కేటీఆర్.. మంచి ఛాన్స్ మిస్

-

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మంచి హీటు మీద ఉన్నాయి. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి కేటీఆర్ మధ్యనే పొలిటికల్ వార్ నడుస్తోందని చెప్పాలి. ఇద్దరూ ఢీ అంటే ఢీ అన్న రేంజ్ లో మాటల యుద్ధం సాగుతోంది. అయితే కేటీఆర్ ఈ మధ్య రేవంత్ రెడ్డి సెట్ చేస్తున్న ట్రెండ్ ను ఫాలో అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ కాంగ్రెస్ కు టీపీసీసీ చీఫ్ కాకముందు కేటీఆర్ ఆయన విషయంలో పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఇప్పుడు రేవంత్ చేస్తున్న ప్రతి విమర్శకు కూడా రిప్లై ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఆయన ఓవర్ గా రియాక్టు కావడమే రేవంత్ పై చేయి సాధించేందుకు అనుకూలంగా మారింది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

అయితే శశిథరూర్ విషయంలో కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ రేవంత్ కు బాగానేే తగిలింది. రేవంత్ ఆడియో క్లిప్ బయటపెట్టడంతో చివరకు రేవంత్ దిగి వచ్చారు. బహిరంగంగానే రేవంత్ రెడ్డి శశిథరూర్ కు సారీ చెప్పేదాకా కేటీఆర్ చక్రం తిప్పేశారు. అయితే ఈ ఎఫెక్ట్ నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి డ్రగ్స్ ఎపిసోడ్ ను తెరమీదకు తెచ్చారు. ఈ డ్రగ్స్ విషయంలో కేటీఆర్ అనవసరంగా ఓవర్ గా రియాక్టు అయ్యారు. దీన్నే అదునుగా చేసుకున్న రేవంత్ మరో అడుగు ముందుకు వేసి గన్ పార్కు దగ్గర నిరసన తెలపడం కూడా ఆయనకు కలిసి వచ్చింది.

కేటీఆర్ ఈ విషయంలో ఒకటి రెండు ట్వీట్లు చేసి ఊరుకుంటే శశిథరూర్ ఎపిసోడ్ పక్కకు వెళ్లేది కాదేమో. కానీ కేటీఆర్ చేజేతులా తాను వేసిన ఎత్తుగడను పక్కకు తప్పించేసుకున్నారు. ఈ డ్రగ్స్ గొడవలోకి రాహుల్ గాంధీని తీసుకురావడంతో పూర్తిగా ప్రజల ద్రుష్టి శశిథరూర్ ఎపిసోడ్ నుంచి డ్రగ్స్ మీదకు మళ్లింది. తన ప్లాన్ ను వర్కౌట్ చేసుకున్న రేవంత్ మరోసారి పై చేయి సాధించినట్లు అయింది. ఇలా కేటీఆర్ ప్రతి విషయంలో స్పందించడం వల్లనే రేవంత్ ఓ అడుగు ముందే ఉంటున్నారని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version