ఏపీలో కరెంట్‌ లేదు, నీళ్లు లేవు – కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

-

ఇవాళ క్రెడాయ్‌ సదస్సులో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో కరెంటు, నీళ్లు ఇతర వసతులు లేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం తన మిత్రుడు పండగకు ఏపీ వెళ్లివచ్చారు. వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు…నాలుగు రోజులు ఉన్నాను….అక్కడ కరెంట్ లేదు,నీళ్లు లేవు,రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు.

తెలంగాణలోని వాళ్ళను నాలుగు రోజులు బస్సుల్లో ఏపీకి పంపండి…తెలంగాణ సర్కార్ ఏమి చేస్తుందో విలువ తెలుస్తుందని అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. నేను చెప్పడం కాదు…మీరు కూడా ఒక సారి ఏపీ వెళ్లి చూసి రండన్నారన్నారు. అప్పుల తెలంగాణ అని కొందరు అంటారు కేసీఆర్ అప్పు చేసి నీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగం కోసం ఖర్చు చేసామని వెల్లడించారు.

భవిష్యత్ తరాల మీద పెట్టేది పెట్టుబడి అవుతుందని.. అప్పుచేసి పప్పు బెల్లాల పంచితే తప్పు అవుతుందని పేర్కొన్నారు. అప్పు చేసి పునరుత్పాదక రంగాల మీద పెట్టుబడి పెడితే తప్పు ఏంటి ? అని ఫైర్‌ అయ్యారు. 111 జీవో ఎత్తివేస్తే ఏదేదో మాట్లాడ్తున్నారు… 111 జివో నా కోసం ఎత్తివేసారని ఒక పిచ్చోడు అంటారని ఆగ్రహించారు. 1 లక్ష 30 వేల ఎకరాలు నావేనా ? అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version