అక్రమ కేసులపై ఉన్న మోజు… ఆరోగ్య శాఖపై లేకపాయే అంటూ KTR ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితి పైన రేవంత్ రెడ్డి సర్కార్ ను నిలదీస్తూ KTR ట్వీట్ చేశారు. అడ్డగోలు సంపాదన పై మోజు-పెద్దాసుపత్రుల ఆలన పాలన పై లేకపాయే అంటూ ఫైర్ అయ్యారు.
కుటిల రాజకీయాలపై ఉన్న మోజు – రోగుల కష్టాలపై లేకపాయే అని మండిపడ్డారు. ముళ్ల కంచెలపై ఉన్న మోజు – ఆసుపత్రుల్లో మందుల కొరతపై లేక పాయే అని ఆగ్రహించారు. పోలీసు ఉద్యోగాలు ఊడ పీకడంపై ఉన్న మోజు – ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత పై లేకపాయే అంటూ నిప్పులు చెరిగారు. గుండె పట్టేస్తుంది ఆయాసంగా ఉందని వస్తే పక్కనున్న ప్రయివేట్ ఆసుపత్రికి పొమ్మనబట్టే అన్నారు KTR. పైసలే ప్రామాణికమైన మీ పైసల పాలనలో అన్ని రంగాల్లో అవేధనలు, అవస్థలు, అన్యాయాలే అని చెప్పారు.