అనేవాళ్లు అంటుంటారు కానీ కెసిఆర్-కేటీఆర్-హరీష్ రావు ముగ్గురిని విడివిడిగా మాట్లాడిన ప్రతీ సారి తమలో ఉన్న ఐక్యతను ఏదోరకంగా వారు చాటి చెప్పుకుంటూనే ఉంటారు. ఎన్నికలకు ముందు కూడా హరీష్ రావుకి ఎంతో ముఖ్యమైన పార్టీ బాధ్యతలను అప్పజెప్పిన కేటీఆర్ ఆ తర్వాత మంత్రివర్గంలో అతికీలకమైన ఫైనాన్స్ మినిస్టర్ పదవిని ఇచ్చి అతని పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు. అలాగే అవకాశం వచ్చిన ప్రతిసారి హరీష్ రావు కూడా తను పార్టీకి మరియు కేసీఆర్ నిర్ణయాలకు పూర్తి విధేయుడనని మాటలతోనే చెప్పడమే కాకుండా చేతులతో కూడా చూపిస్తూ ఉంటాడు.
అయితే తాజాగా మరి కొద్ది కాలంలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని కేటీఆర్ రూపంలో చూడవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ హరీష్ రావు పేరు తెరమీదకు వచ్చింది. కెసిఆర్ ఈ మధ్య హరీష్ రావు పట్ల చిన్న చూపు ని చూపిస్తున్నారు అన్న ఆరోపణల నడుమ విమర్శకులు అందరికీ హరీష్ రావు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు
స్వయంగా హరీష్ రావు నే కేసీఆర్ తో అతని కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయమని సూచించాడట. కేంద్రంలో బీజేపీ పతనం ఆరంభమైన నేపథ్యంలో దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం తమకు ఉందని మరియు ఎలాగూ పొరుగు రాష్ట్రంలో ఉన్న జగన్ మద్దతు కూడా ఉంది కాబట్టి ఇక్కడ పార్టీ బాధ్యతలను కేటీఆర్ కి అప్పగించేయమని సలహా ఇచ్చేశాడట. తెరాస విమర్శలకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు అనే చెప్పాలి.