మహిళ ట్వీట్​కు కేటీఆర్ స్పందన.. రంగంలోకి డీజీపీ

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ వద్ద రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు సరైన ప్రజా రవాణా ఉండదు. ఆ సమయంలో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడవవు. దీనివల్ల ఆ సమయంలో వచ్చే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ ఈ సమస్యను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఇక ట్విటర్​లో నిత్యం అందుబాటులో ఉంటూ.. ప్రజాసమస్యలను పరిష్కరించే కేటీఆర్ దృష్టికి ఈ ట్వీట్ వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు ఆటోలు నడిపేలా చర్యలు తీసుకోవాలని మహిళ చేసిన ట్వీట్​కు వెంటనే మంత్రి స్పందించారు. స్పందించడమే కాకుండా వెంటనే చర్యలకు ఉపక్రమించారు.

మహిళలకు రాత్రి సమయంలో పోలీసుల ఆధ్వర్యంలో ఆటోలు నడపాలని.. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ డీజీపీ అంజనీ కుమార్​కు సూచించారు. జీపీఎస్ ట్రాకింగ్‌ మెకానిజమ్​తో రాత్రి సమయంలో ఆటోలు ఏర్పాటు చేస్తామని.. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని అంజనీ కుమార్ కేటీఆర్​కు రిప్లై ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version