కల్నల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌

-

చైనా సైనికుల దాడిలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని సూర్యాపేట‌లో ఆవిష్క‌రించారు. సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన సంతోష్‌ బాబు కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. మొత్తం 9 అడుగుల‌ ఎత్తుతో సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా సంతోష్‌ బాబు స్మారకార్థం సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాకు సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేసారు.ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌ రెడ్డితో పాటు సంతోష్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


కాగా గతేడాది జూన్ లో లడాఖ్‌ సరిహద్దులోని గల్వాన్‌ లోయలో చైనా దురాక్రమణను తిప్పికొట్టే క్రమంలో కల్నల్‌ సంతోష్‌బాబు వీరమరణం పొందిన విషయం తెల్సిందే. కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సంతోష్‌బాబు సతీమణీని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. అలానే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రముఖ కోర్ట్ చౌరస్తాలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు కూడా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version