రాజకీయాల్లో ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలనే వ్యవహారం కామనే. నిత్యం పోటీ ఉండేది రాజకీయా ల్లోనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఎవరికి వారు తమను తాము ప్రొజెక్ట్ చేసుకునేందుకు, తమ బలాన్ని నిరూపించుకునేందుకునిత్యం పాకులాడుతూనే ఉంటారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా పోటీ వాతావరణం నెలకొంది. అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో ఒకే కుటుంబ నేపథ్యంలో ఉన్న కేటీఆర్, హరీష్ రావులు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. ఎవరికివారే రాజకీయాల్లో తమ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఎవరికివారుగా మాటకారులు కూడా.
ఇక, ఎన్నికల సమయానికి వచ్చేసరికి అధినేత కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు తమదైన శైలితో ఇద్దరు బావ బావమరుదులు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటారు. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు పైచేయి సాధించి ఆధిపత్యం చూపించేందుకు మెజారిటీ స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకుప్రయత్నించారు. ఈ క్రమంలోనే కేటీఆర్.. కరీంనగర్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ తన సత్తా చూపిస్తానని అప్పట్లో వెల్లడించారు.
అదే సమయంలో హరిష్ రావు మెదక్ పార్లమెంటు ను గెలిపించి తీరుతానని చెప్పారు. చిత్రంగా టీఆర్ ఎస్ కరీంనగర్‌లో అంటే కేటీఆర్ సవాలు చేసిన చోట ఓడిపోయింది. మెదక్‌లో భారీ మెజారిటీ సాధించింది. ఇక, ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలకు రంగం రెడీ అయింది. ఇప్పటికే ప్రచారం పర్వం కూడా ముగిసిపో యింది. దీంతో అందరి దృష్టీ ఇప్పుడు హరీష్, కేటీఆర్‌పైనే ఉంది. సిరిసిల్ల, కరీంనగర్. మునిసిపాలిటీ ల్లో ఎవరి సత్తా ఎంత? అనే చర్చ కూడా సాగుతోంది.
వాస్తవానికి సిద్దిపేట టీఆర్ ఎస్ పరిధిలోనే ఉంది. కానీ, కరీంనగర్ మాత్రం బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆధిపత్యంలో ఉంది. సో.. ఇక్కడ ఎలాగైనా కమల వికాసం చేసితీరునని సంజయ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో ఎక్కువ స్థానాలను కేటీఆర్ గెలిపిస్తారా? లేక మెదక్‌లో హరీష్‌రావు సత్తా చాటుతారా? అనే విషయంపై తెలంగాణలో ఆసక్తి కర చర్చ కొనసాగుతోంది.