ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరుకానున్నారు. 16వ తేదీ విచారణకు హాజరు కావాలంటూ రెండోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ.. ఏసీబీ FIR ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. FEO కంపెనీకి హెచ్ఎండిఏ నిధులను ఆర్బిఐ రూల్స్ విరుద్ధంగా బదిలీ చేశారు అధికారులు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్ల బదిలీలు జరిగినట్లు ఆరోపనలు వస్తున్నాయి.
ఈ కేసు లో A1గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్,బిఎల్ఎన్ రెడ్డి ని విచారించారు ఈడీ. వారిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ ను విచారించనున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. కేటీఆర్ ఆదేశాల మేరకే నగదు బదిలీ చేశామని స్టేట్మెంట్ ఇచ్చారట అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి. తనపై ఏసీబీ నమోదు చేసిన FIR ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టు వెళ్లిన కేటీఆర్ కు చుక్కెదురైంది. కేటీఆర్ పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీం కోర్టు.