ఈనెల 9న యాదగిరిగుట్టలో పర్యటించనున్న కేటీఆర్

-

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికి ఆయా పార్టీలు ప్రచారంలో భాగంగా ముందుకు దూసుకెళ్తున్నాయి.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈ నెల 9వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలో పర్యటించనున్నారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్‌ను గెలిపించాలని కోరుతూ చేపట్టే బైక్ ర్యాలీలో కేటీఆర్ పాల్గొంటారని ఆ పార్టీ నేతలు తెలిపారు.

అనంతరం కార్నర్ మీటింగ్‌లో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి,మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తదితరులు ముఖ్య నేతలు హాజరయ్యే ఈ ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version