తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలి.. కేటీఆర్ హెచ్చరిక

-

ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీపై, నేతలపై అసత్యప్రచారాలు ప్రసారం చేస్తూ. ప్రజలను తప్పుదోవ పట్టించే యూట్యూబ్ చానెళ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ధ అబద్దాలను చూపిస్తున్నాయని మండిపడ్డారు. అలాగే గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయని, ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నామని అన్నారు.

ఇది కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు.గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు గుర్తుచేశారు. ఇక ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని అన్నారు. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబునెల్స్ తో వార్తల పేరిట ప్రాపగండకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు, క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో ఛానళ్లను నిషేదించాలని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version