చాయ్ వాలాలకు కేటీఆర్ ఫోన్.. తమ్ముడు అధైర్యపడకు నీకు నేనున్నానంటూ!

-

సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి చాయ్ డబ్బా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అయితే, రెండ్రోజుల కిందట చాయ్ డబ్బాకు ట్రేడ్ లైసెన్స్ లేదని అధికారులు దుకాణాన్ని సీజ్ చేశారు.అంతటితో ఆగకుండా శుక్రవారం క్రేన్‌ సాయంతో చాయ్ డబ్బాను తొలగించి ట్రాక్టర్లో తీసుకెళ్లిపోయారు.

దీనికి కారణం చాయ్ డబ్బాలో కేటీఆర్ ఫొటో ఉందనే అధికారులు అలా రియాక్ట్ అయ్యారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.ఉపాధిని కోల్పోయి రోడ్డున పడిన బాధితుడు శ్రీనివాస్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఫోన్లో మాట్లాడారు. ‘తొందర్లోనే వస్తా దుకాణం కొత్తది పెట్టించి నేనే ఓపెన్ చేస్తా’.. తమ్ముడు శ్రీనివాస్ అధైర్యపడకు నీ కుటుంబ బాధ్యత నాది’ అంటూ భరోసానిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

https://twitter.com/KTR_News/status/1892937686928736731

Read more RELATED
Recommended to you

Latest news