జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకీరామ్‌ను వేరే మహిళతో ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే.జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు అతని భార్య తెలిపింది. ఓ ప్లాట్‌లో తన భర్త వేరే మహిళతో ఉండగా..ఆ ఇద్దరినీ భార్య కళ్యాణి చితకబాదింది.
ఈ ఘటన సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో చోటుచేసుకోగా..వారాసిగూడ పోలీసులు బంధువుల దాడి నుంచి జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్, దివ్య అనే మహిళను పీఎస్‌కు తరలించి విచారించగా..మరో కొత్త విషయం వెలుగుచూసింది. మొదటి భార్య చనిపోవడంతో ఆరేళ్ల క్రితం కళ్యాణిని జానకీరామ్ రెండవ వివాహం చేసుకున్నట్లు తెలిసింది.పెళ్లి అయిన దగ్గర నుంచి తనను శారీరకంగా హింస్తున్నాడని కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కూడా ఉద్యోగం చేసే చోట పలువురు అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది.దీంతో నాలుగు నెలలుగా భార్య కళ్యాణికి భర్త దూరంగా ఉంటూ దివ్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మొదటి భార్య చనిపోవడంతో ఆరేళ్ల క్రితం కళ్యాణిని రెండవ వివాహం చేసుకున్న జానకీరామన్
పెళ్లి అయిన దగ్గర నుంచి శారీరకంగా హింస్తున్నాడని కళ్యాణి ఫిర్యాదు. గతంలో కూడా ఉద్యోగం చేసే చోట పలువురు అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నాడని కళ్యాణి ఆరోపణ. నాలుగు నెలలుగా భార్య కళ్యాణికి దూరంగా ఉంటున్న… https://t.co/viATO7S6Ui pic.twitter.com/wjDOwkUHXT
— ChotaNews App (@ChotaNewsApp) February 21, 2025