బిచ్చగాడిలా ధనుష్.. కుబేర ఫస్ట్ లుక్ అవుట్..!

-

అక్కినేని నాగార్జున ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ కుబేర రాబోతుంది. సునీల్ నారాయణ రామ్మోహన్రావు కలిసి సినిమాని నిర్మిస్తున్నారు రష్మిక మందన్న సినిమాలో నటిస్తోంది. జిమ్ సర్బ కీలక పాత్ర పోషిస్తున్నారు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ వీడియోని మేకర్స్ శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ లుక్ లో ధన ప్రదాత కుబేరుడు పేరు టైటిల్ గా పెట్టి ధనుష్ని మాత్రం చిరిగిన దుస్తుల్లో గడ్డంలో బిచ్చగాడిలా చూపించారు.

అత్యంత ధనవంతుడైన దేవుడి పేరుని ఈ సినిమాకి పెట్టడంతో అందరిలో ఆసక్తి కలిగింది. అన్నపూర్ణాదేవి నుండి పరమశివుడు భిక్ష తీసుకుంటున్న ఫోటోని బ్యాక్ డ్రాప్ లో చూపించారు. మూవీ మీద క్యూరియాసిటీని పెంచేశారు కుబేర నుండి ఫస్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేయగా ప్రస్తుతం అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు ఫస్ట్ లుక్ వీడియోని విపరీతంగా షేర్ చేస్తున్నారు కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version