ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీలో నిలిచిన జేడీ(ఎస్) నేత కుమార స్వామి ఎంపీగా గెలిచారు. దీంతో ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కింది.దీంతో ఆయన ఈ రోజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
కుమార స్వామి పార్లమెంట్ ఎన్నికల్లో మాండ్యా నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు మోడీ కేబినెట్ లో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దక్కింది. కర్ణాటక రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన మూడో సారి ఎంపీగా గెలిచి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో రామనగర అసెంబ్లీకి బై ఎలక్షన్ జరగనుంది.