రాజీనామా అనంతరం కూన శ్రీశైలం గౌడ్ సంచలన వ్యాఖ్యలు..

-

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ డిసిసి ప్రెసిడెంట్ కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నానని అన్నారు. ”గత మూడు దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో ఉంటున్నా, 2009లో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇయ్యకున్నా ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిపొందా, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా,మాజీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన పోరాటం చేశాను’ అని అన్నారు. అయితే గత ఆరేడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధకలిగిస్తున్నాయని ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు.

రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలో విఫలమైందని ఇవన్నీ చూసిన ప్రజలు కూడా టిఆర్ఎస్ అక్రమాలను,హామీల అమలు చేయడంలో వైఫల్యాలను కాంగ్రెస్ పోరాడలేదని ఒక నిర్ణయానికి వచ్చారని దీనికి ఉదాహరణ దుబ్బాక ,జిహెచ్ఎంసి ఎన్నికల్లో స్పష్టమైందని అన్నారు. చివరకు పీసీసీ చీఫ్ రాజీనామా చేసినా కొత్త నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యం జరిగే కారణం…పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలేనని అన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానన్న ఆయన ప్రజల సమస్యలపై పోరాటం చేయాలంటే బీజేపీతోనే సాధ్యమని ఓ నిర్ణయానికి వచ్చానని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా TRSపై అసలుసిసలు పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీనే అని నిర్ణయానికి వచ్చానని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version