ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఖుష్బూ.. కానీ..?

-

ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ఇప్పటికే ఎందరో ప్రముఖులు స్పందించారు. సుశాంత్ తో తమకున్న అనుబందాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఎంతోమంది ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడ్ని కోల్పోయిందని కొందరు, పుడమి తల్లి ఒక పుణ్యత్ముడిని కోల్పోయిందని మరి కొందరు అభిప్రాయపడ్డారు. తాజాగా సుశాంత్ మృతిపై న‌టి ఖుష్బూ స్పందించారు. ఒత్తిడితో కూడిన స‌మ‌స్య‌లు, ప‌రిస్థితులు ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఉంటాయ‌ని, వాటిని ఎదుర్కొవాల‌ని సూచించారు. ఒక‌ప్పుడు తాను కూడా తీవ్ర‌మైన మానసిక ఒత్తిడిని అనుభ‌వించాన‌ని, జీవితాన్ని కూడా ముగించాలి అనుకున్న‌ట్లు తెలిపారు. కానీ వాటితో పోరాడి త‌న‌ను నాశనం చేయాల‌నుకున్న స‌మ‌స్య‌ల కంటే తాను స్ట్రాంగ్ అని నిరూపించుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇకపోతే ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు దర్యాప్తులో స్పీడ్ పెంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version