ఢిల్లీలో ఆక్సిజన్ కొరతకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానిదే బాధ్యత అని నిన్న ఆరోపించిన కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఇప్పుడు ఢిల్లీ ‘ప్రభుత్వం’గా వ్యవహరించనున్నారు. ఎన్సీటీ చట్టాన్ని కేంద్రం అమలు చేయడంతో లెఫ్టినెంట్ గవర్నర్ కి సంపూర్ణ అధికారాలు అప్పచెప్పినట్టు అయింది.
నిన్న నగరంలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ రవాణా చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఢిల్లీ చీఫ్ సెక్రటరీ విజయ్ దేవ్ కు రాసిన లేఖలో దుయ్యబట్టారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తీవ్రంగా ఉన్న సమస్య పరిష్కారానికి మీరు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా లేవు.. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయంలో తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయని, వాటి నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదని ఆయన అన్నారు.