లాల్ సలాం టీజర్ రిలీజ్.. మొయిద్దీన్ భాయ్ గా రజినీ అదుర్స్..!

-

రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సలాం. విష్ణు విశాల్, విక్రమ్ సంతోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. జైలర్ తో భారీ హిట్ అందుకున్న రజనీకాంత్.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న లాల్ సలాం చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు సమాచారం. తాజాగా లాల్ సలాం టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. విడుదలైన కొద్ది సేపటికే మిలియన్స్ రావడం విశేషం.

జైలర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ ఈ సినిమాలో ముస్లిం నాయకుడిగా కనిపించనున్నాడు. క్రికెట్ తో మొదలైన గొడవలు సమాజంలో మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఎందుకు మారాయి అనేది ఈ సినిమా కథాంశం. టీజర్ లో రాజనీ సీరియస్ లుక్ లో కనిపించగా విష్ణు విషయాలు ఏదో గొడవలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. క్రికెట్ ఆటతో ముడిపడి ఉన్న ఓ యాక్షన్ కథాంశంతో రూపొందించిన చిత్రం లాల్ సలాం ఇందులో మోయుద్దిన్ భాయ్ అనే పాత్రలో రజనీకాంత్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు వచ్చే ఏడాది సంక్రాంతికి లాల్ సలాం విడుదల కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version