ప్రతిపక్షంలో ఉండగానే అరాచకాలకు దిగుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య తరచూ మాట యుద్ధం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఏకంగా కొన్ని ప్రాంతాల్లో ఇరువురు పార్టీల నేతలు దాడులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇబ్రాహీంపట్నంలో నామినేషన్ల సందర్భంగా రాళ్ల దాడి జరిగింది. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో ఎంపీ కొత్త ప్రభాకర్ పై కత్తి తో దాడి.. నిన్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్లతో దాడి ఇలా ప్రతీ చోటా దాడులు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా నల్గొండ జిల్లాలోని ఆర్జాలబావి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రతిపక్షంలో ఉండగానే అరాచకాలకు దిగుతున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇక అధికారంలోకి వస్తే ఎలాంటి అరాచకాలు సృష్టిస్తారని పలువురు బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. అర్జాలబావి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో.. కోమటిరెడ్డి వెంట వచ్చిన గుండాల దాడుల్లో ముస్లిం మైనారిటీ నేత గాయపడ్డారు. దాడిలో స్వయంగా పాల్గొన్నారు కోమటిరెడ్డి. మరోవైపు కాంగ్రెస్ నేతలు తాగిన మత్తులో నోటికి వచ్చినట్లు దూషిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లుగా గెలిచిన అభ్యర్థులు కాంగ్రెస్ లోకి వెళ్లారు. దీంతో అక్కడ ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version