రాష్ట్రంలో ఇటీవల హిందూ ఆలయాలపై వరుసగా దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వర్గానికి చెందిన కొందరు కావాలనే హిందూ ఆలయాలను టార్గెట్గా చేసుకుని రాత్రిళ్లు దాడులకు పాల్పడుతుండటంపై హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత కల్లోలాలు రేపేందుకు కొందరు కావాలని ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహ ధ్వంసాన్ని మర్చిపోక ముందే ఇటీవల రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఎయిర్ పోర్టు వద్ద ఇటీవల హనుమాన్ ఆలయంలో నవగ్రహ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.తాజాగా బుధవారం ఆ ఆలయాన్ని లేడీ అఘోరీ సందర్శించారు. అంతేకాకుండా, జిల్లాలోని పలు దేవాలయాలను ఆమె సందర్శిస్తూ తిరుగుతున్నారు. హనుమాన్ ఆలయంలోని నవగ్రహ విగ్రహాలు, సిద్ధాంతి కట్ట మైసమ్మ దేవాలయం, జూకల్ సౌడమ్మ దేవాలయాన్ని ఆమె సందర్శించిన అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ వద్ద అఘోరీని పోలీసులు అడ్డుకున్నారు.