దారుణం : తాగిన మైకంలో రెండేళ్ల కొడుకుని చంపిన తల్లి

-

రంగా రెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని రామన్నగూడలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఒక తల్లి తన రెండేళ్ల కొడుకుని కొట్టి చంపింది. అయితే కుటుంబ కలహాలు దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే ఎందుకు ఇలా జరిగింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే జార్ఖండ్ రాష్ట్రంలో సొంత తల్లిని చంపిన ఒక దుర్మార్గుడు ఇంట్లోనే ఆమెకు చితి పేర్చి కాల్చివేశాడు..

అనంతరం అదే చేతిలో చికెన్ కాల్చుకొని తింటూ మద్యం తాగాడు ఆ నరరూప రాక్షసుడు. మద్యానికి బానిసైన కొడుకుని మద్యం మానిపించడానికి ఆ తల్లి నాలుగు మంచి మాటలు చెప్పడమే తప్పయిపోయింది. నాకే నీతులు చెబుతావు అంటూ తల్లి ని ఘోరంగా హత్య చేసిన దుర్మార్గుడు ఆమె ఇంట్లోనే కాల్చి చంపాడు. అప్పటికే మద్యం మత్తులో ఉండడంతో ఏం చేస్తున్నాడో తెలీని పరిస్థితుల్లో చికెన్ ఆమె చితిలోనే కాల్చుకుని తినడం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version