దేశంలోనే మొదటిసారిగా హైదరాబాదులో వేలిముద్రలు ద్వారా కాకుండా ఓటిపి తో రేషన్ పంపిణీ ప్రారంభిస్తున్నారు. అయితే దీనికోసం ఆధార్ తో మన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా అనుసంధానం అయి ఉండాలి. ఎప్పుడైతే మన ఆధార్ నెంబర్ తీసుకుని రేషన్ డీలర్లు ఆన్లైన్ లో ఎంటర్ చేస్తారో అప్పుడు మన ఫోన్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. దాని ద్వారానే ఇప్పుడు పంపిణీ జరగనుంది.
ఈ ఆధార్ తో మొబైల్ నెంబర్ అనుసంధానం తప్పనిసరి కావడంతో హైదరాబాద్ పోస్టల్ రీజియన్ కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే తెలంగాణలో తమ పరిధిలో 124 ఆధార్ కేంద్రాల్లో ఫోన్ నెంబర్, ఐరిస్ ల అనుసంధాన ప్రక్రియ చేపడుతున్నామని పేర్కొంది. తమ తపాలా కార్యాలయాలను ఆశ్రయించి సేవలు వినియోగించుకోవాలని ఒక ప్రకటనలో కోరింది. ఈ 124 ఆధార్ కేంద్రాలతో పాటు మరో 15 మొబైల్ కేంద్రాల్లో కూడా ఈ సర్వీసు అందిస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.